శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించాలని కేంద్రమంత్రులు ముఖ్యమంత్రులు ప్రముఖసంస్థల ప్రతినిధులకు ఆహ్వానం: చైర్మన్ రమేష్ నాయుడు
శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించాలని దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు ఆహ్వానం.శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించాలని కోరుతూ పలువురు ప్రముఖులకు ఆహ్వానిస్తున్నట్లుగా దేవస్థానం చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు తెలిపారు. శ్రీశైలం క్షేత్రాన్ని కేంద్ర మంత్రులు,పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,క్షేత్రానికి విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరుతూ,ధర్మకర్తల మండలి తరఫున ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా దాతలను ఆహ్వానించుటలో భాగంగా పలు ప్రముఖ సంస్థ ప్రతినిధులను కూడా క్షేత్రాన్ని సందర్శించాలని కోరనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుందన్నారు.