మంచిర్యాల: మంచిర్యాలలో ఘనంగా కొమురం భీమ్ జయంతి వేడుకలు
మంచిర్యాల బీజేపీ కార్యాలయంలో కొమురం భీమ్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ముకేశ్ గౌడ్ పాల్గొని నివాళులర్పించారు. ఆదివాసీల హక్కుల కోసం భీమ్ చేసిన పోరాటం ఆదర్శనీయమని ఆయన అన్నారు.