మార్కాపురం: జిల్లా కేంద్రంలోని వివేకానంద విద్యాపీఠంలో వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా వ్యాసరచన పోటీలు
మార్కాపురం వివేకానంద విద్యాపీఠంలో ఫారెస్ట్ అధికారులు వన్యప్రాణుల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అటవీ రక్షణ వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకత గురించి ఫారెస్ట్ అధికారులు అవగాహన కల్పించారు. మూగజీవాల పట్ల దయ ప్రేమ కలిగి ఉండాలన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి అక్టోబర్ 8 తేదీ వన్యప్రాణుల వారోత్సవాల కార్యక్రమంలో బహుమతులు ఇస్తామన్నారు.