బనగానపల్లె: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు మంత్రి కుటుంబానికి తీర్థ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం చేశారు. రాష్ట్ర అభివృద్ధి నిరంతరాయంగా విజయపథంలో కొనసాగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు.