జగిత్యాల: జగిత్యాలలో ఘనంగా జాతీయ దేవాలయ ప్రవేశ దినోత్సవం
జగిత్యాలలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో జాతీయ దేవాలయ ప్రవేశ దినోత్సవం నిర్వహించారు. కుల వివక్ష లేకుండా అందరికీ దేవాలయ ప్రవేశం ఉండాలని, సమాజంలో హిందూ ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విభాగ్ సంయోజక్ చిట్ల గంగాధర్ పిలుపునిచ్చారు.