మండపేట: జగన్‌పై దాడి అమానుషం: షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా
ప్రజాదారణతో వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలుపు సాధ్యమని తేలిపోవడంతో ఓర్చుకోలేక కడుపుమంటతో జగన్‌పై అమానుషంగా దాడి చేశారని షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా అన్నారు. మండపేట వైకాపా కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ జనక్షేత్రంలో అడుగడున నీరాజనాలు అందుకుంటున్న తమ నాయకుడు జగన్‌పై దాడి దారుణమని పేర్కొన్నారు.అశేష జన స్పందనతో సాగిన యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడి చేసిన వారు ఎంతటి వారైనా సరే వారిని శిక్షించాలని కోరారు.