ఒంగోలు అర్బన్: టిడిపిని వీడి వైసీపీలో చేరిన ఒంగోలు మాజీ నూర్ భాషా సంఘం అధ్యక్షురాలు సాఫీయా, ఆమె భర్త, పార్టీలోకి ఆహ్వానించిన రవిబాబు
Ongole Urban, Prakasam | Oct 15, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ నూర్ భాషా సంఘం అధ్యక్షురాలు సాఫీయా ఆమె భర్త టిడిపిని వీడి వైసీపీలో చేరారు. గురువారం ఒంగోలు వైసిపి ఇన్ ఛార్జ్ చుండూరు రవిబాబు సమక్షంలో ఇరువురు పార్టీ కండువా కప్పుకున్నారు. గతంలో వైసిపి నుంచి టిడిపిలోకి వెళ్లిన కారణాలను వారు తెలిపారు. బీసీలకు వైసీపీలోనే న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని జగనన్న గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తామని ఇరువురు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.