గిద్దలూరు: బేస్తవారిపేట గాంధీనగర్లో చిన్న మామను హత్య చేసి పిల్లనిచ్చిన మామని హత్య చేయబోయిన అల్లుడిని అదుపులకు తీసుకున్న పోలీసులు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట లోని గాంధీ నగర్ లో ఈ నెల 23వ తేదీన చిన్నమామ ఖాజావలిని హత్య చేసి ఆపై పిల్లనిచ్చిన మామ హుస్సేన్ రాజన్న హత్య చేయబోయిన పీరావలి ని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు లేదా రేపు మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలిస్తామని పోలీసులు వెల్లడించారు. ఉద్యోగం చూసుకోవాలని భార్యను బాగా చూసుకోవాలని మందలించినందుకే నిందితుడు హత్య చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.