మందమర్రి: మందమర్రి ఏరియాలో రికార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి: నాలుగవ స్థానానికి చేరిక
మందమర్రి ఏరియాలో సెప్టెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి వివరాలను జీఎం రాధాకృష్ణ వెల్లడించారు. గతంలో 10వ స్థానంలో ఉన్న మందమర్రి ఏరియా, ఇప్పుడు 113 శాతం ఉత్పత్తితో నాలుగవ స్థానానికి చేరుకుంది. ఈ ఘనతకు కృషి చేసిన కార్మికులకు జీఎం కృతజ్ఞతలు తెలిపారు.