అసిఫాబాద్: బెజ్జుర్ లో శివాలయంలో భక్తుల కిటకిట
బెజ్జూర్ మండల కేంద్రంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం, అర్చనలు ఆలయ ప్రధాన అర్చకుడు గురుదత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామ స్మరణంతో ఆలయం మార్మోగింది.