మంచిర్యాల: మంచిర్యాలలో ఘనంగా శాఖాహార ర్యాలీ: పాల్గొన్న మేయర్ మరియు ప్రజా ప్రతినిధులు
మంచిర్యాలలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శాఖాహార ర్యాలీ నిర్వహించారు. గాంధీ పార్కు నుంచి మొదలైన ఈ ర్యాలీలో మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్ పాల్గొన్నారు. శాఖాహారం, ధ్యానం యొక్క ఆవశ్యకతను ఈ సందర్భంగా వివరించారు.