తూర్పుగోదావరి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 2,36,301 మందికి పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు.ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పథకంలో భాగంగా గోకవరం మండలం గుమ్మల దొడ్డిలో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రశాంతి పర్యటించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడాతు ప్రతినెల సచివాలయం సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వచ్చి పింఛన్ల పంపిణీ చేస్తున్నారా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు.