ఉండవెల్లి: గద్వాల హైవేపై నాగుపాము కలకలం: 15 నిమిషాల పాటు నిలిచిన ట్రాఫిక్
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం నేషనల్ హైవే 44పై నాగుపాము రావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రిలయన్స్ పెట్రోల్ పంపు సమీపంలో పాము రోడ్డుపైకి రావడంతో సుమారు 15 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి. పాము వెళ్ళిపోయిన తర్వాత ట్రాఫిక్ పునరుద్ధరించబడింది.