మచిలీపట్నం దక్షిణం: పామర్రు బైపాస్ వద్ద ఘోర ప్రమాదం: టిప్పర్ లారీని ఢీకొట్టిన కారు, మహిళ మృతి
Machilipatnam South, Krishna | Oct 25, 2026
కృష్ణా జిల్లా పామర్రు గుడివాడ బైపాస్ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ లారీని కారు ఢీకొట్టడంతో జగ్గయ్యపేటకు చెందిన ఓర్సు చిన్న తిరుపతమ్మ (55) మృతి చెందారు. కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.