విజయనగరం: భోగాపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం: మినీ వ్యాన్ ఢీకొనడంతో వృద్ధుడు మృతి
భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జాతీయ రహదారి దాటుతున్న కొల్లి ఎర్రయ్య అనే వృద్ధుడిని మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఎర్రయ్య, సుందరపేట ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు.