సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో యూరియాను వెంటనే సరఫరా చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా
సూర్యాపేట జిల్లా: రైతాంగానికి సరిపడా యూరియాను అందించాలని బ్లాక్ మార్కెట్లో యూరియా దందాను అరికట్టాలని సిపిఐ ఎంఎల్ మాస్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సూర్యాపేటలోని ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. జూన్లో రావలసినటువంటి యూరియాను ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పంపించకపోవడం తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అన్నారు.