మహబూబ్ నగర్ జిల్లాలోని కోటకద్ర వద్ద యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. యూరియా కావాలి అంటూ, కలెక్టర్ రావాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో రాయచూర్-మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి రైతులకు సరిపడే యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.