మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్నగర్ జిల్లాలోని పోలీసు కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం
మహబూబ్నగర్ జిల్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా పాలన దినోత్సవంలో జోగులాంబ జోన్ -7 డీఐజీ ఎల్.ఎస్.చౌహన్ జెండా ఆవిష్కరించారు. ప్రజాపాలన ప్రాముఖ్యత, పారదర్శక పాలన ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. ఎస్పీ డి. జానకి మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి పోలీస్ సిబ్బంది మరింత కృషి చేయాలని సూచించారు.