బనగానపల్లె: నందవరం లో 3000 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విశేష పూజల అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత, విశేష ద్రవ్యాభిషేకాలు నిర్వహించారు. సుమారు 3,000 మంది మహిళలు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. భక్తులకు పూజా ద్రవ్యాలు ఉచితంగా అందించడంతో పాటు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.