జగిత్యాల రూరల్: జగిత్యాలలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి భూమిపూజ
జగిత్యాల జిల్లా తాటిపల్లి–మొరపల్లి శివారులో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి నేడు భూమిపూజ జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొననున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.