గజపతినగరం: స్వచ్ఛ గ్రామాల్లో భాగంగా పొడి చెత్త ఇచ్చిన వారికి బహుమతుల పంపిణీ
గజపతినగరం మండలంలోని పురిటిపెంట కాలనీలో స్వచ్ఛ గ్రామాల్లో భాగంగా ఎంపీడీవో కళ్యాణి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అధిక పొడి చెత్తను ఇచ్చిన ప్రజలకు ఈ సందర్భంగా బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.