విజయవాడ గుణదల ప్రాంతంలో ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. గుణదల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేష్ కుమార్ విజయ్ కుమారి దంపతులు గుణదల ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సురేష్ కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగ పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 5 గంటలు లేచి బయటికి వచ్చి చూశారు. ఇంటి డోర్లన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. అనుమానం వచ్చి ఇంటి కబోర్డ్స్ ఓపెన్ చేయడంతో వస్తువులన్నీ చల్లచదురుగా పడి ఉన్నాయి. బంగారం ఉన్న వస్తువుల బ్యాగు కనిపించలేదు. బాత్రూం అద్దాలు తెరిచి ఉండటానికి గమనించి ఇంట్లో చోరీ జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.