గుంతకల్లు: టీడీపీకి కార్యకర్తలే అధినేతలు, గుంతకల్లులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్
తెలుగుదేశం పార్టీకి సామాన్య కారకర్తలే అధినేతలని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్. వేడుకలకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముందుగా ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయడం వేయడం జరిగింది,అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ నుండి పాత గుంతకల్లు శివాలయం వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహింవారు.