పార్వతీపురం: పాలకొండలో మెడికల్ షాపులపై 'ఆపరేషన్ గరుడ' దాడులు
పాలకొండలో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్ఆర్ఎక్స్ మందుల విక్రయ రికార్డుల్లో లోపాలు ఉండటంతో కొన్ని మెడికల్ షాపుల యాజమాన్యాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా నిషేధిత మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.