జగిత్యాల: సిరిసిల్ల సీఎం పర్యటన వేళ జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ హౌస్ అరెస్ట్
సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తనను నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఇది అప్రజాస్వామికమని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు.