కర్నూలు: కోడుమూరు 6వ ఎంపీటీసీ అభ్యర్థిగా బి. రాజు నామినేషన్
కోడుమూరు 6వ ఎంపీటీసీ స్థానానికి సీపీఐ అభ్యర్థిగా బి. రాజు నామినేషన్ దాఖలు చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు లక్ష్యంగా తమ అభ్యర్థిని గెలిపించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లెనిన్ బాబు కోరారు.