శ్రీశైలం: ఉదయం టిడిపి మధ్యాహ్నం వైఎస్ఆర్సిపి సాయంత్రం మళ్లీ టీడీపీలోకి మారిన నేతలు ఆత్మకూరులో ఎన్నికల విచిత్రం
ఆత్మకూరులో ఎన్నికల విచిత్రం కొనసాగుతుంది. 13వ వార్డుకు చెందిన నబి రసూల్ ఆయన సోదరుడు నూరు మహమ్మద్ టిడిపిలో కొనసాగుతుండేవారు. ఈరోజు ఉదయం వరకు టిడిపిలో ఉండి మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. మళ్ళీ సాయంత్రం వెళ్లి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో మళ్లీ టిడిపి కండువా కప్పుకున్నారు. ఒకే రోజు ఉదయం టిడిపి మధ్యాహ్నం వైఎస్ఆర్సిపి సాయంత్రం తెలుగుదేశం పార్టీలోకి చేరడంతో ప్రజలంతా నవ్వుఉంటున్నారు.