పార్వతీపురం: డీఎస్సీ విజేతలపై అసత్య ఆరోపణలు సరికాదు: ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర
డీఎస్సీ ద్వారా ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన యువతపై రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న అసత్య ఆరోపణలను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఖండించారు. కోటవానివలసకు చెందిన స్కూల్ అసిస్టెంట్ రవికుమార్‌ను అభినందించిన ఆయన, ప్రభుత్వం నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.