ఉదయగిరి పట్టణంలోని ABM కాంపౌండ్లో శనివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఉదయగిరికి చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తిని దగదర్తి మండలం చవటపుత్తెడు గ్రామానికి చెందిన పులి ఎర్రయ్య (75)గా కుటుంబ సభ్యు లు నిర్ధారించారు.