ఉదయగిరి పట్టణంలోని చెక్క నగిషి కేంద్రాన్ని డీఎఫ్ఓ ఖాదర్ భాషాతో కలిసి విశ్రాంత సీసీఎఫ్ జేఎస్ఎన్ మూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా కళాకారులు తయారు చేస్తున్న వస్తువులను ఏ జాతి కర్రతో తయారు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కర్ర కొరత ఏమైనా ఉందా అని ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి.. తదితర విషయాలను కళాకారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ డి ఎఫ్ సి శ్రీకాంత్ రెడ్డి, రేంజ్ అధికారి బిఎస్ కుమార్ రాజా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.