ఏటూరునాగారం: ములుగు: ప్రభుత్వ పాఠశాల నిర్లక్ష్యం.. మళ్లీ ప్రైవేట్ బాట పట్టిన విద్యార్థులు!
ములుగు జిల్లా చిన్నబోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల లేమిపై తల్లిదండ్రుల నిరసన. 5 నెలలుగా యూనిఫామ్స్ లేకపోవడం, టీచర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లకు మళ్లీ విద్యార్థులను పంపిస్తున్నారు. పాఠశాలను కాపాడాలని కలెక్టర్, మంత్రిని కోరుతున్న గ్రామస్తులు.