ఏటూరునాగారం: వెంకటాపురం బెస్తగూడెంలో పోలీసుల మెరుపు దాడులు.. భారీగా గుడుంబా స్వాధీనం
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ముగ్గురిపై కేసులు నమోదు చేయగా, పత్రాలు లేని 15 బైక్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.