అనంతపురం అర్బన్: నగరంలోని గుత్తి రోడ్డులో మద్యం మత్తులో వ్యక్తి హల్చల్, భారీ వాహనాలను ఆపుతూ తీవ్ర ఇబ్బందులు
Anantapur Urban, Anantapur | Nov 30, 2025
అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆదివారం రాత్రి హల్చల్ చేశాడు.. ఈ సందర్భంగా భారీ వాహనాలను అతను అడ్డుకొని ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బంది కలిగించాడు. రోడ్డు మధ్యలో డాన్స్ చేస్తూ అందరిని ఇబ్బందులకు గురి చేశాడు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు అనంతపురం నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చోటుచేసుకుంటున్నాయి. వీటిని ఆపాలని నగర ప్రజలు కోరుతున్నారు.