మార్కాపురం: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు ఆర్టీసీ ఉద్యోగులు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏపీ పిడిటి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలంటే తమరు ప్రవేశపెట్టాలనుకుంటున్నా ఎలక్ట్రిక్ బస్సుల సీటింగ్ సామర్థ్యం కనీసం 60 సీటింగ్ ఉండాలన్నారు. ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సిట్టింగ్ సామర్థ్యం కలిగిన 9/12 మీటర్లు విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలనుకుంటే 25వేల బస్సులు అవసరమవుతాయన్నారు.