వనపర్తి: వనపర్తి జిల్లాలో భూ రీ సర్వేపై కలెక్టర్ ఆదర్శ సురభి కీలక ఆదేశాలు
వనపర్తి జిల్లా జక్కంపల్లిలో భూ రీ సర్వే పనులను కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని, సర్వేకు ముందు రైతులకు సమాచారం అందించి వారి సంతకాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించాలని సూచించారు.