ఎవరూ లేని సమయంలో తన కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువకుడు పై తండ్రి కత్తితో దాడి చేశాడు ఈ దాడిలో యువకుడు తలకు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ సంఘటన తాండూర్ నియోజకవర్గం యాలాల మండలం బెన్నూరు గ్రామంలో చోటు చేసుకుంది ఎస్ఐ విట్టల్ రెడ్డి తెలిపే వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అమృతప్ప అదే గ్రామానికి చెందిన మల్లప్ప కూతురు మైనర్ బాలికతో బుధవారం రాత్రి ఎవరు లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు దీంతో మల్లప్ప కత్తితో అమృతప్ప పై కత్తితో దాడి చేశాడు ఈ క్రమంలో అమృతప్ప తలకు చేతికి గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం తాండూర్ లోనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు