హుస్నాబాద్: హుస్నాబాద్‌లో గుర్రం జాషువా 132వ జయంతి వేడుకలు
హుస్నాబాద్ జనజాగృతి కార్యాలయంలో కవికోకిల గుర్రం జాషువా 132వ జయంతిని నిర్వహించారు. కౌన్సిలర్ గాదెపాక రవీందర్ పాల్గొని, బడుగు బలహీనవర్గాల చైతన్యం కోసం జాషువా చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.