తెరపల్లి చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి..ఇప్పటి వరకూ తెలియని మృతుడి వివరాలు..చింతపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు
చింతపల్లి మండలంలోని పెదబరడ పంచాయతీ పరిధిలో ఉన్న తెరపల్లి గ్రామ శివారులలో ఉన్న చెరువులో 2023 జూలై 13న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించిందని ఎస్సై వెంకటేశ్వర్లు ఆదివారం రాత్రి తెలిపారు. అప్పుడే రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. అయితే ఇప్పటి వరకూ ఆ వ్యక్తి వివరాలు తెలియలేదన్నారు. మృతుడి వయసు 30నుంచి 35ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. అతడి భుజంపై పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమకు సహకరించాలని కోరారు.