సీపీఐ కోడుమూరు నియోజకవర్గ మహాసభలు ఆదివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులతో డప్పు ప్రదర్శన చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ మహాసభలకు సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునియప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.