ఒంగోలు అర్బన్: ఉద్యోగాల పేరుతో జగన్ మోసగిస్తే ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది :ఒంగోలు ఎమ్మెల్యే
Ongole Urban, Prakasam | Sep 18, 2026
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను జగన్ మోసగిస్తే, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ రాష్ట్ర యువతకు బంగారు పునాదులు వేస్తున్నామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. శుక్రవారం ఒంగోలు నగరంలోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువులు పూర్తికాగానే యువతకు ఉద్యోగాలు లభించేలా సీఎం చంద్రబాబు జాబ్ క్యాలెండర్ ప్రకటించారని తెలిపారు