గిద్దలూరు: గిద్దలూరులో టీడీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలలో పాల్గొని జెండా ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
తెలుగువారి ఆత్మ గౌరవం నుంచి టిడిపి పార్టీ పుట్టిందని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కార్యకర్తలతో కలిసి జెండా ఆవిష్కరించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు నేటికీ ఏర్పడిన ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.