సదాశివ పేట్: సదాశివపేట: కోరి గుంతలో పడి 30 ఏళ్ల వ్యక్తి మృతి
సదాశివపేట మండలం మాలపాడు శివారులో కోరి గుంతలో పడి మన్నే నర్సింలు (30) మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.