నేరేడుగొమ్ము: మండల కేంద్రంలో మద్యం మత్తులో నాయనమ్మను కత్తితో దాడి చేసి పొడిచిన మనవడు, తీవ్ర గాయాలు
నల్గొండ జిల్లా, నేరేడుగొమ్ము మండల కేంద్రంలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. బుధవారం ఉదయం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో తన సొంత నాయనమ్మ పై కత్తితో దాడి చేసి పొడిచాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుండి హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.