వింజమూరు మండలం,చాకలికొండలో మోటార్ బైక్పై వచ్చి ఇద్దరు యువకులు మహిళ మెడలో నుంచి చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. చాకలికొండకు చెందిన వృద్ధురాలు కాటంరెడ్డి చిన్న రవణమ్మ తన ఇంటి నుంచి సమీప బంధువుల ఇంటికి నడుచుకుంటూ వెళ్తంది. ఇద్దరు యువకులు అటకాయించి మెడలోని చైన్ లాక్కొని వెళ్లారని ఆమె వాపోయారు. చైన్ లాక్కొని బైక్పై వెళ్తున్న దృశ్యం సీసీ ఫుటేజ్లో నమోదయింది.