మచిలీపట్నం దక్షిణం: అర్నబ్ తుఫాను: కృష్ణా జిల్లా అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
Machilipatnam South, Krishna | Oct 25, 2026
అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను అప్రమత్తం చేశారు. 26వ తేదీ రాత్రి నుంచి అధికారులు హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక కేంద్రాల్లో వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.