నర్సీపట్నం: గుండుపాల గ్రామ అభివృద్ధికి రూ. 1.39 కోట్లు మంజూరు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
గొలుగొండ మండలం గుండుపాల గ్రామంలో 'పల్లె పండుగ 3.0' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గ్రామాభివృద్ధికి రూ. 1.39 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల వివరాలను ఆయన వెల్లడించారు.