ఒంగోలు అర్బన్: ఇచ్చిన మాట ప్రకారం ఒంగోలులో గాంధీభవన్ నిర్మించి గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Oct 2, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇచ్చిన మాట ప్రకారం గాంధీభవ నిర్మించి నూతన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. శుక్రవారం గాంధీ జయంతి పురస్కరించుకొని ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో మంత్రి స్వామితో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. విగ్ర ఆవిష్కరణ అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడారు. గాంధీజీ అడుగుజాడలే అందరికీ ఆదర్శమని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని మంత్రి తెలిపారు.