మంచిర్యాల: బీసీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకాని నాయకులు, అసంతృప్తి వ్యక్తం చేసిన నిర్వాహకులు
మంచిర్యాలలో నిర్వహించిన బీసీ ఆత్మీయ సమ్మేళనానికి పలువురు కుల, రాజకీయ నాయకులు హాజరు కాలేదు. బీసీల మధ్య ఐక్యత లేకపోవడం బాధాకరమని బీసీ ఐక్యవేదిక కన్వీనర్ నరెడ్ల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.