శ్రీశైలం: ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా బాపూజీకి ఘన నివాళులు
అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీజీ చిత్రపటానికి ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ మరియు కార్యాలయ పోలీస్ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మా గాంధీజీ చేసిన అహింసా పోరాటాన్ని, ఆయన సేవలను స్మరించుకున్నారు. జాతిపిత పూజ్య బాపూజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొంటూ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.