గోవిందరావుపేట: పస్రా పీహెచ్సీలో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో ఆకస్మిక తనిఖీ
పస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో గురువారం తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.